నారాయణపేట జిల్లాలో లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైబర్ బాధితులకు ఊరట

నారాయణపేట జిల్లాలో లోక్  అదాలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైబర్  బాధితులకు ఊరట

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: నారాయణపేట జిల్లాలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్  అదాలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైబర్  నేరాల బారిన పడిన బాధితులకు ఉపశమనం లభించింది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 52 సైబర్  క్రైం కేసులు నమోదవగా, రూ.25.58 లక్షలు- రికవరీ చేసినట్లు ఎస్పీ వినీత్  తెలిపారు. 

జాతీయ లోక్  అదాలత్  ద్వారా బాధితులకు న్యాయం జరిగిందని చెప్పారు. 167 వివిధ కేసులు, 364 డ్రంక్  అండ్  డ్రైవ్, 1,513ఈ పెట్టీ కేసులతో కలిపి 2,044 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు.