యూపీఎస్సీ సీఎంఎస్ నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (సీఎంఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు మార్చి 11న ప్రారంభమవుతుంది. మార్చి 31న ముగుస్తుంది.
మొత్తం ఖాళీలు: 1358.
విభాగాల వారీగా ఖాళీలు: మెడికల్ ఆఫీసర్ (సెంట్రల్ హెల్త్ సర్వీస్ – సీహెచ్ఎస్) 864, అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (రైల్వేలు) 450, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ – ఎన్డీఎంసీ) 14, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ – ఎంసీడీ) 30.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్షిప్ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 32 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు, మాజీ సైనికులకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 11.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.200.
రాత పరీక్ష తేదీ: 2026, ఆగస్టు 2.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ upsc.gov.in/ upsconline.nic.inను సందర్శించండి.
సెలెక్షన్ ప్రాసెస్
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష, రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–Iలో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ నుంచి 250 ప్రశ్నలు 250 మార్కులకు, పేపర్ – IIలో సర్జరీ, గైనకాలజీ & అబ్స్టెట్రిక్స్, ప్రివెంటివ్ & సోషల్ మెడిసిన్ నుంచి 250 ప్రశ్నలు 250 మార్కులకు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.
ఇంటర్వ్యూ
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
