సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : టీజీసీఎస్పీ ఎస్పీ హర్షవర్ధన్

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : టీజీసీఎస్పీ ఎస్పీ హర్షవర్ధన్
  •     టీజీసీఎస్పీ ఎస్పీ హర్షవర్ధన్

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు : సైబర్ నేరాలు, ఆన్​లైన్ మోసాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్ సూచించారు. సోమవారం గీతం యూనివర్సిటీ, టీజీసీఎస్బీ సహకారంతో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో సెమినార్​నిర్వహించింది. 

ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్​తో కలిసి హర్షవర్ధన్ హాజరై సైబర్ ఫ్రాడ్స్ విషయాలపై మాట్లాడారు. రోజురోజుకూ సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. మొబైల్స్ ద్వారా సాఫ్ట్​వేర్లను ఇన్​స్టాల్ చేసి బ్లాక్​మెయిల్, దోపిడీ, డేటా దర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఆన్​లైన్ గేమింగ్, చాటింగ్ లాంటి ​విషయాల్లో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఓటీపీ, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసం, ఏపీకే ఫైల్ ట్రాప్స్, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లాంటి ఫ్లాట్​పామ్స్​లో ఆన్​లైన్ మోసాలు జరుగుతున్నామయని వివరించారు. 

సైబర్​నేరానికి గురైనవారు వెంటనే సైబర్​ క్రైమ్, హెల్ప్​లైన్ నంబర్​ 1930కి సమాచారం అందిస్తే ఫలితం ఉంటుందన్నారు. అనంతరం అందరితో సైబర్ సేఫ్టీ ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో స్కూల్​ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, కోర్ ఇంజినీరింగ్ డీన్​ ప్రొఫెసర్​వీఆర్ శాస్ర్తి, ప్రొఫెసర్ త్రినాథరావు, నోడల్ ఆఫీసర్ కేవీ సూర్యప్రకాశ్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, పటాన్​చెరు ఎస్​హెచ్​వో వినాయక్​ రెడ్డి, సీఐలు రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.