ఆయిల్ పామ్ టార్గెట్ సాధించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

ఆయిల్ పామ్ టార్గెట్ సాధించాలి : కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్  కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ఆయిల్ పామ్​ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్  విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో హార్టికల్చర్, అగ్రికల్చర్, సహకార శాఖల అధికారులతో ఆయిల్  పామ్  సాగుపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆయిల్  పామ్  సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 1,500 ఎకరాల్లో ఆయిల్  పామ్  చేయాలని లక్ష్యం ఉండగా, 714 ఎకరాలకు అడ్మినిస్ట్రేటివ్​ శాంక్షన్​ ఇచ్చామని తెలిపారు. 303 ఎకరాల్లో ఆయిల్  పామ్  తోటలు పెట్టించామని, మిగిలిన 1,197 ఎకరాల్లో వచ్చే రెండు నెలల్లో ఆయిల్​పామ్​ సాగయ్యేలా చూడాలన్నారు. హార్టికల్చర్​ ఆఫీసర్​ కె వేణుగోపాల్, డీఏవో వెంకటేశ్, జిల్లా  సహకార అధికారి కృష్ణ, బాలరాజు పాల్గొన్నారు.