విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  •      కలెక్టర్ రాహుల్ రాజ్​

మెదక్​ టౌన్​, వెలుగు : విధి నిర్వహణలో ఉద్యోగులు పారదర్శకత పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో టీఎన్జీవో నాయకులు కలెక్టర్​ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉద్యోగులు నిబద్ధతతో పనిచేశారని, మున్ముందు కూడా మరింత చిత్తశుద్ధితో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. 

అనంతరం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ జిల్లా ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు అందిస్తూ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. అనంతరం జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్​తో కలిసి సజావుగా ఎన్నికలు జరిగినందున కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్​నగేశ్, డీపీవో యాదయ్య,  జడ్పీ సీఈవో ఎల్లయ్యను శాలువాతో సన్మానించారు. 

కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రఘునాథరావు, ఫజలుద్దీన్, సంయుక్త కార్యదర్శి పోతురాజు శంకర్, క్రీడల కార్యదర్శి గోపాల్, కార్యవర్గ సభ్యులు సలావుద్దీన్, సతీశ్, నర్సాపూర్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు శేషాచారి, శేఖర్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శి సంతోష్, శ్రీకాంత్, కిరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.