వారం రోజుల్లో టెస్కోకు వస్త్రాల ఆర్డర్లు ఇవ్వాలి : శైలజ రామయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వారం రోజుల్లో టెస్కోకు వస్త్రాల ఆర్డర్లు ఇవ్వాలి : శైలజ రామయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లకు శైలజ రామయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు తమకు అవసరమైన వస్త్రాల ఆర్డర్లను వారం రోజుల్లోపు టెస్కోకు అందజేయాలని చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఆదేశించారు. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను అన్ని ప్రభుత్వ శాఖలు తమ అవసరాల మేరకు వస్త్రాల ఇండెంట్లను వారం రోజుల్లో టెస్కోకు అందజేయాలని సూచించారు. 

అదేవిధంగా, టెస్కోకు వివిధ శాఖలు బకాయి పడిన నిధులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం 4 శాఖల నుంచే ఆర్డర్లు అందాయని, మిగిలిన శాఖలు వారం రోజుల్లోగా ఆర్డర్లు ఇవ్వాలని అధికారులను కోరారు. వస్త్రాల ఇండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు 50% నిధులను అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెల్లిస్తే, టెస్కో  ఉత్పత్తిని ప్రారంభించి సరఫరా చేయగలదని పేర్కొన్నారు.