నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్దం

V6 Velugu Posted on Jun 20, 2021

బంగారు తెలంగాణ వంద శాతం వచ్చి తీరుతుందన్నారు సీఎం కేసీఆర్. ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వుల కోసం తాము పనిచేస్తున్నామన్నారు. తాను తప్పుచేస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటానన్నారు. తమది రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వమన్నారు . రైతు మంచిగుంటే ఊరు సల్లగుంటదన్నారు. రైతులతో ఎంతోమందికి పనిదొరుకుతుందన్నారు. తెలంగాణలో పండిన పత్తికి మంచి డిమాండ్ ఉందన్నారు.పత్తిని కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరముందన్నారు.తెలంగాణలో ఈరోజు 400 జిన్నింగ్ మిల్లులున్నాయన్నారు. అన్ని ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామన్నారు. అవినీతిని అరికట్టేందుకు రైతుల ఖతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నామన్నారు. రైతుబంధుకు  15 వేల కోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు. 95 శాతం రైతుబంధు సద్వినియోగమవుతోందన్నారు. రైతు రాజ్యం అంటే ఇదేనన్నారు. 

ధరణి కోసం మూడేళ్లు శ్రమించామన్నారు కేసీఆర్. రెవిన్యూలో 37 రకాల చట్టాలున్నాయని..అవి ఎవరికి అర్థం కావన్నారు. ధరణిలో ఒక్కసారి భూమి ఎక్కిందంటే దాన్ని ఎవరూ మార్చలేరన్నారు. మూడు రకాలుగా మాత్రమే భూమి ఇతరులకు మారుతుందన్నారు. అమ్మకం,వారసత్వం,గిఫ్ట్ డీడ్  ఈ మూడు పద్దుతుల్లోనే మారుతుందన్నారు. ధరణిలో ఆరులక్షల రిజస్ట్రేషన్లు జరిగాయన్నారు.ఇష్టానుసారం రైతులను ఏడిపించారన్నారు. రాష్ట్రంలో 93శాతం చిన్న కమతాలేనన్నారు.రైతు బీమా ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. రైతు కుటుంబాలకు రక్షణ కల్పించేందుకు ఈ పథకం అన్నారు. ఇవన్నీ ప్రజలకు అమలవుతున్నాయన్నారు. అందుకే ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నామన్నారు.మిషన్ భగీరథను 11 రాష్ట్రాల వాళ్లు వచ్చి చూసిపోయారన్నారు. మల్లన్నసాగర్ పూర్తయితే నెత్తిమీద కుండ అని అన్నారు

కేసీఆర్  కిట్ తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో డెలీవరీలు పెరిగాయన్నారు. తాను ధైర్యంగా చెబుతున్నాని.. తెలంగాణలో ఎవరూ ఉపవాసం ఉంటలేరన్నారు కేసీఆర్. రూ.2కిలో బియ్యం తనకు చాలా నచ్చిన పథకం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు పేదల కోసం ఖర్చవుతున్నాయన్నారు. ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లపై చాలా పెద్ద బాధ్యత ఉందన్నారు. మీరు నేలవిడిచి సాము చేయకూడదన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 98 శాతం గ్రామాల్లో వైకుంఠధామాలు పూర్తయ్యాయన్నారు. ఆక్సిజన్ కొనుక్కోవాల్సిరావడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టామన్నారు. ఇంతకు ముందు నర్సరీ అంటే ఏంటో తెలియదన్నారు. ఆకస్మిక తనిఖీ పేరుతో ఎవరినో తొలగించడం తన ఉద్దేశం కాదన్నారు.పనిచేయని వారిని ఏం చేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో 56 వేల మంది డాక్టర్లు ఉన్నారన్నారు.

Tagged CM KCR, siddipet, Bangaru Telangana, hundred percent

Latest Videos

Subscribe Now

More News