
తెలంగాణలో పండే వడ్లు కొంటారా కొనరా అని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీలు దారుణంగా విఫలమయ్యాయని ఆయన అన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.
‘భారత దేశం మొత్తం ఈ గోస ఉంది. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీలు దారుణంగా విఫలం అయ్యాయి. రైతులను కేంద్రం బతకనిస్తుందా లేదా? ధాన్యాన్ని నిల్వ చేసే సామర్ధ్యం ఏ రాష్ట్రానికి లేదు. విషయం అర్దం చేసుకోలేని ఇంగిత జ్ఞానం కేంద్రానిది. డొంక తిరుగుడు మాటలతో రైతులను మభ్య పెడుతున్నారు. యాసంగి వరి వేయోద్దని చెప్పడం నాకు భాదేస్తోంది. పచ్చి అబద్ధాలతో దేశాన్ని నడుపుదామనుకుంటున్నారా? ఒపికకు హద్దు ఉంటుంది. సభలో సీఐడీ వాళ్ళు ఉన్నారు. మోదీకి పది నిమిషాల్లో నేను మాట్లాడింది తెలుస్తుంది. వరి వేయాలని ఆర్డర్ తీసుకురావాలని అడిగితే సమాధానం లేదు. వరి కొనకపోతే వడ్లు మీ బీజేపీ ఆఫీస్ గుమ్మం ముందు పోస్తం. పదవులు మాకు లెక్క కాదు. అవసరం అయితే రైతుల కోసం టీఆర్ఎస్ లీడర్షిప్ తీసుకుంటుంది. రైతు వ్యతిరేక చట్టాలపై చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తాం. మీ సరిహద్దు నాటకాలు, సర్జికల్ స్ట్రైక్‌లు బట్టబయలు అయ్యే సమయం వచ్చేసింది. ఎన్నికలు వస్తే మతకలహాలు రెచ్చగొడుతారు. ఈ పోరాటం వడ్లతో స్టార్ట్ అయింది. దేశం కోసం కూడా పోరాటం చేస్తాం. ఈ గోల్ మాల్ మాటలు మాట్లాడుతున్న వాళ్లకు చరమ గీతం పాడాల్సిందే. దేశంలో జెండా లేవాల్సిందే. మరో పోరాటానికి సిద్ధం కావాలి. దేశ ప్రజలు బిచ్చగాళ్లు కాదు. ఇంత అరాచకంగా కేంద్రం పాలిస్తుందా? రెండు చేతులు జోడించి మోడీని వేడుకుంటున్నా.. వరి వేయాలా? వద్దా? చెప్పాలి. రెండు మూడు రోజులు వేచి చూస్తాం. కేసులకు భయపడేది లేదు. అవసరం అయితే గ్రామాల్లో చావు డప్పు కొడదాం. రాజకీయాలు పక్కన పెడితే టీఆర్ఎస్లా రణం చేసే పార్టీ దేశంలో లేదు’ అని సీఎం కేసీఆర్ అన్నారు.