లాక్‌‌డౌన్ పొడిగించాలా? వద్దా?

లాక్‌‌డౌన్ పొడిగించాలా? వద్దా?

సీఎం కేసీఆర్ అధ్యక్షతన బేగంపేట క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్, లాక్‌డౌన్, ధాన్యం కొనుగోలు, రైతుబంధు తదితర అంశాలపై మీటింగ్‌లో ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 12న రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ నేటితో ముగియనుంది. దీంతో లాక్‌డౌన్ పొడిగించాలా? వద్దా? అనే  అంశంపై సీఎం కేసీఆర్ మంత్రులతో డిస్కస్ చేయనున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం ముందు మూడు ఆప్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ కంటిన్యూ చేయడం, మరిన్ని సడలింపులు ఇవ్వడం లేదంటే సడలింపుల టైమ్‌ను పొడగించడం. ఈ మూడింటిని సీఎం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు  తగ్గాయని అధికారులు అంటున్నారు.

కాగా.. ప్రభుత్వం మాత్రం అన్‌లాక్ దిశగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాలు మినహా మిగతావన్నీ ఓపెన్ చేయాలని యోచిస్తోంది. పండ్లు, కూరగాయలు, కిరాణా షాపులకు ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని... వాటిని రోజంతా తెరిచి ఉంచేలా ప్లాన్ చేస్తోంది.  మాల్స్, థియేటర్లు,  రెస్టారెంట్లు, గేమింగ్  జోన్లు, పబ్బులు, పార్కులు, క్లబ్ హౌస్‌లు మాత్రం క్లోజ్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు  సమాచారం. అయితే ప్రస్తుతమున్న ఈ సడలింపులను మరో వారం, పది రోజుల పాటు కొనసాగించి.. ఆ తర్వాత నైట్ కర్ఫ్యూను మాత్రమే పెట్టాలని భావిస్తున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.