తెలంగాణలో 70 ప్రచార సభలకు కేసీఆర్

తెలంగాణలో 70 ప్రచార సభలకు కేసీఆర్

నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా 70 ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే నవంబర్​28 సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రచార సభలు ఉండనున్నట్టు సమాచారం. నవంబర్​15 నుంచి వరుసగా కేసీఆర్ సభలు ఉండే అవకాశముంది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై బీఆర్ఎస్ చీఫ్ ఎక్కువగా ఫోకస్​చేసినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక ప్రచార సభ ఉంటుందని సమాచారం. ఎన్నికల షెడ్యూల్​రావడంతో మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు ఒక్కో నియోజకవర్గంలో కనీసం రెండేసి ప్రచార సభల్లో పాల్గొననున్నట్టు చెప్తున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో కేటీఆర్​రోడ్​షోలకు ప్లాన్​చేస్తున్నారు. 

మిగతా చోట్ల ప్రచార సభలు ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్​ఉమ్మడి జిల్లా ప్రచార బాధ్యతలు ఎమ్మెల్సీ కవిత చూసుకోనున్నారు. గ్రేటర్​తో పాటు ఉత్తర తెలంగాణ బాధ్యతలు మంత్రి కేటీఆర్, ఉమ్మడి మెదక్​తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రచారాన్ని మంత్రి హరీశ్​రావుకు అప్పగించారు. ఎన్నికల షెడ్యూల్​వచ్చే లోపే కేటీఆర్, హరీశ్​రావు 60కి పైగా నియోజకవర్గాలను చుట్టేశారు. ఎన్నికల షెడ్యూల్​రావడానికి కొద్దిసేపటి ముందే జయశంకర్​భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్​ను కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వార అధికారిక కార్యక్రమాలను ఆపేసి పార్టీ ప్రచార సభల్లో పాల్గొన్నారు. మంత్రి హరీశ్​రావు ప్రగతి భవన్​లోనే ఉండి ప్రభుత్వపరంగా చక్కబెట్టాల్సిన కార్యక్రమాలపై ఫోకస్​చేశారు. బతుకమ్మ పండుగ, దసరా, దీపావళి పండుగలను మినహాయించి కేటీఆర్, హరీశ్​రావు నిత్యం ప్రజల్లోనే ఉండేలా షెడ్యూల్​సిద్ధం చేస్తున్నారు.