సీఎం హోదాలో మొదటిసారి గాంధీకొచ్చిన కేసీఆర్

సీఎం హోదాలో మొదటిసారి గాంధీకొచ్చిన కేసీఆర్

కరోనా పేషంట్లకు వైద్యం అందిస్తూ.. నోడల్ సెంటర్‌గా ఉన్న గాంధీ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ఈ రోజు పర్యవేక్షించారు. ఆయన వెంట ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నారు. ఆస్పత్రిలో కరోనా పేషంట్లకు అందుతున్న వైద్యం, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అందుకు గాను ఆయనే స్వయంగా పేషంట్లతో మాట్లాడారు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ కేసీఆర్ దగ్గరే ఉండటంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. కాగా.. సీఎం హోదాలో కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అక్కడి నుంచి కేసీఆర్ గచ్చిబౌలిలోని టిమ్స్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. సీఎం కేసీఆర్ గాంధీకి వస్తున్నారన్న సమాచారంతో డీఆర్‌ఎఫ్ బృందం ఆస్పత్రి మొత్తాన్ని శానిటైజ్ చేసింది.

గాంధీలో ప్రస్తుతం 1500 మంది కరోనా పేషంట్లు చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ వార్డుల్లో తిరుగుతూ పేషంట్లతో మాట్లాడారు. భయపడొద్దంటూ కరోనా పేషంట్లకు ఆయన ధైర్యం చెప్పారు. అదేవిధంగా కరోనాతో నిరంతరం పోరాటం చేస్తున్న డాక్టర్లను, వైద్యసిబ్బందిని ఆయన అభినందించారు.