
సీఎం కేసీఆర్ విజయవాడ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ విజయవాడ వెళ్లారు. మధ్యాహ్నం 1.45 గంటలకు కేసీఆర్ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లి నివాసంలో ఏపీ సీఎం జగన్‌ను కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను….కేసీఆర్ ఆహ్వానించనున్నారు. సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో జరిగే కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కానున్నారు. రాత్రి 8 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.