చింతమడకలో ఓటేయనున్న కేసీఆర్​

చింతమడకలో ఓటేయనున్న కేసీఆర్​


హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్​ సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్​లో ఉన్న కేసీఆర్​చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత హైదరాబాద్​కు వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

బీఆర్ఎస్​వర్కింగ్ ​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  హైదరాబాద్​లోని నందినగర్​లో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్​లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మంత్రి హరీశ్​ రావు సిద్దిపేటలో ఓటు వేయనున్నారు.