
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాలని కోరారు. హోలీ పండుగ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని ఇస్తుందని సీఎం అన్నారు. ప్రకృతి మెచ్చే రంగులతో హోలీ జరుపుకోవాలని సూచించారు.