ఆపరేషన్ గంగా ఇంకా పూర్తి కాలేదు

ఆపరేషన్ గంగా ఇంకా పూర్తి కాలేదు

ఆపరేషన్ గంగా ఇంకా కొనసాగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి  తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పింది. ఉక్రెయిన్లో ఇప్పటికీ 15 నుంచి 20 మంది ఇండియన్లు చిక్కుకుని ఉన్నారని వెల్లడించింది. వారంతా సాయం కోసం ఎదురుచూస్తున్నారని.. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు.ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల్లో కొందరు ఖేర్సన్ లో ఉన్నారని.. వారిని తొందరలోనే భారత్ కు తీసుకువస్తామని అన్నారు. 

మరోవైపు ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను వెనక్కి  తెచ్చేందుకు జనవరి నుంచి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్  బుధవారం ప్రకటించారు. దాదాపు 20వేల మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొందరు ఉక్రెయిన్ నుంచి భారత్ తిరిగి వచ్చేందుకు నిరాకరించారని అన్నారు. యూనివర్సిటీలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని చెప్పినా చదువుపై ప్రభావం పడుతుందని చాలా మంది అక్కడే ఉండిపోయారని అన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

బంగారు తెలంగాణ అని.. ఆత్మహత్యల తెలంగాణ చేసిండు

రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలి