బంగారు తెలంగాణ అని.. ఆత్మహత్యల తెలంగాణ చేసిండు

బంగారు తెలంగాణ అని.. ఆత్మహత్యల తెలంగాణ చేసిండు

బంగారు తెలంగాణ చేస్తా అని, ఆత్మహత్యల తెలంగాణ చేసిన ఘనత కేసీఆర్‎దేనని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర 28వ రోజు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి చేరుకుంది. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. 

‘వైఎస్సార్ హయాంలో లక్షల ఉద్యోగాలు, పేదలకు ఆరోగ్య శ్రీ , ఫీజు రీయింబర్స్‎మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, 108, 104 సర్వీసులు మొదలైన ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు అందిచ్చారు. కరెంట్, ఆర్టీసీ చార్జీలు, మున్సిపల్ చార్జీలు పెంచని ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కేసీఆర్ రుణమాఫీల పేరుతో  రైతులను, మహిళలను మోసం  చేశాడు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశాడు. వైఎస్సార్ ఉన్నపుడు చేనేతలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు. చేనేత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి నష్ట పరిహారం అందించాడు. కేసీఆర్ హయాంలో చేనేతకి సబ్సిడీ, రంగుల ధర విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదు. ఏ విధంగానూ కూడా కేసీఆర్ చేనేతలను ఆదుకోలేదు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు చనిపోతే  పరామర్శించని ముఖ్యమంత్రి.. దేశాన్ని ఏలుతా అని తిరగడం విడ్డూరం. బంగారు తెలంగాణ చేస్తా అని.. బీర్లు, బార్లు, అప్పుల తెలంగాణ చేశాడు. తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించాలి. ప్రజా సంక్షేమ పాలన కొరకు పుట్టిందే వైఎస్సార్ తెలంగాణ పార్టీ. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత మగ్గాలకు సబ్సిడీ అందిస్తాం. చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్, నూలు మీద సబ్సిడీ అందిస్తాం. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారు’ అని షర్మిల అన్నారు.

For More News..

‘ఆర్ఆర్ఆర్’ కు ఏపీ ప్రభుత్వ గుడ్‎న్యూస్

తెలంగాణలో మండుతున్న ఎండలు

కేసీఆర్ పుట్టిన గడ్డపై నేను కూడా పుట్టడం అదృష్టం