కేసీఆర్ పుట్టిన గడ్డపై నేను కూడా పుట్టడం అదృష్టం

కేసీఆర్ పుట్టిన గడ్డపై నేను కూడా పుట్టడం అదృష్టం

కరీంనగర్: మానేరు రివర్ ఫ్రంట్ దేశానికే తలమానికంగా నిలుస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోయర్ మానేరు వంతెన వద్ద మానేర్ రివర్ ఫ్రంట్ పనులకు మంత్రి కేటీఆర్‎తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గంగుల మాట్లాడారు. ‘కేటీఆర్ పుట్టింది కరీంగనర్‎లోనే. కేసీఆర్ పుట్టిన గడ్డపై నేను కూడా పుట్టడం అదృష్టం. గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అయితే.. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్. ఇవాళ ఒక్కరోజే రూ. 1065 కోట్లతో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశాం. కరీంనగర్ కోసం ఏది అడిగినా కేసీఆర్ కాదనకుండా నిధులిస్తున్నారు. కొండలు, గుట్టలతో ఉండే హైదరాబాద్ గచ్చిబౌలీ ప్రాంతం ఇప్పుడు అమెరికాను తలపిస్తోందంటే... అందుకు కారణం కేటీఆర్’ అని మంత్రి గంగుల అన్నారు. 

ప్రతిపక్షాలు దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నాయి
దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని నీతి ఆయోగ్ చెప్పిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. ప్రతిపక్షాలు ఇక్కడ దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నాయి. వాటిని అందరూ తిప్పి కొట్టాలి. హైదరాబాద్ నుంచి కరీంనగర్‎కు రైలు తీసుకురావాలని ఉద్యమకాలంలోనే కేసీఆర్ ఆలోచించారు. కొద్ది రోజుల్లోనే రైలు మార్గం పూర్తి కాబోతోంది.

For More News..
నెట్ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్ షేర్ చేస్తే అదనఫు ఛార్జీలు!

పీకే ఇక్కడ పనికిరాడు.. గెలిచేది బీజేపీనే