పెంచిన జీతాలు ఇయ్యకుంటే వంట బంద్

పెంచిన జీతాలు ఇయ్యకుంటే వంట బంద్
  • మిడ్‌‌‌‌‌‌‌‌ డే మీల్స్ కార్మికుల మహా ధర్నా 
  • 15 రోజుల్లోపు స్పందించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని సర్కారు బడుల్లో పనిచేస్తున్న మిడ్‌‌‌‌‌‌‌‌డే మీల్స్‌‌‌‌‌‌‌‌ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ చేశారు. వారి జీతాలను రూ.2 వేలకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించి 18 నెలలవుతున్నా, ఇప్పటికీ పెంచిన జీతాలు రావడం లేదన్నారు. వెంటనే పెంచిన జీతాలు ఇవ్వాలని, బకాయిలు రిలీజ్ చేయాలని, లేకపోతే బడుల్లో వంట బంద్ చేస్తామని హెచ్చరించారు.

 మిడ్‌‌‌‌‌‌‌‌డే మీల్స్ కార్మికులకు పెంచిన జీతాలు, పెండింగ్ బిల్లులు, గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద బుధవారం కార్మికులు మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు చీఫ్ గెస్ట్‌‌‌‌‌‌‌‌గా హాజరైన పాలడు గు భాస్కర్ మాట్లాడుతూ, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి, ఏడాదిన్నర దాటినాఅమలుకు నోచుకోవడం లేదన్నారు. 

మిడ్‌‌‌‌‌‌‌‌డే మీల్స్‌‌‌‌‌‌‌‌ కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ.. బిల్లులు క్లియర్ చేస్తామని గత జులైలో చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు.