ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌‌‌‌కు బెయిల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌‌‌‌కు బెయిల్

న్యూఢిల్లీ: ఆమ్​ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌‌‌‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌‌‌‌ కేజ్రీవాల్‌‌‌‌ సహాయకుడు బిభవ్‌‌‌‌ కుమార్‌‌‌‌కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్‌‌‌‌మంజూరు చేసింది. అయితే, అతన్ని కేజ్రీవాల్‌‌‌తిరిగి తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకోవద్దని.. అలాగే, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎలాంటి అధికారిక పదవి ఇవ్వొద్దని కోర్టు సూచించింది. సాక్షులందరినీ విచారించే వరకు బిభవ్​కుమార్ ముఖ్యమంత్రి నివాసంలోకి రాకుండా జస్టిస్​ సూర్యకాంత్, జస్టిస్​ ఉజ్జల్ భుయాన్‌‌‌‌‎తో కూడిన బెంచ్ నిషేధం విధించింది. 

మే 13న కేజ్రీవాల్ అధికారిక నివాసంలో రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌‌‌‌పై బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. దీంతో మే 16న అతనిపై ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. మే 18న అరెస్టు చేశారు. అయితే, అతడు బెయిల్​కోసం ముందు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా రిజెక్ట్​ అయింది. నిందితుడి ఇన్‌‌‌‌ఫ్లూయెన్స్ కలిగిన వ్యక్తి అని, బెయిల్​పై విడుదల చేయడానికి సరైన కారణాలు కూడా లేవని పేర్కొంటూ హైకోర్టు బెయిల్‎ను పిటిషన్‎ను తోసిపుచ్చింది. ఒకవేళ పిటిషనర్ బెయిల్‌‎పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేయడం లేదా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పేర్కొంది.