సన్ బర్న్ ఈవెంట్స్ పెడితే.. తాట తీయండి : సీఎం రేవంత్ రెడ్డి

సన్ బర్న్ ఈవెంట్స్ పెడితే.. తాట తీయండి : సీఎం రేవంత్ రెడ్డి

అనుమతుల్లేకుండా పార్టీలు నిర్వహిస్తున్న సన్ బర్న్ పై  చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సన్ బర్న్ పార్టీకి సంబంధించి డిజిటల్ మార్గంలో టికెట్లు అమ్ముతున్నారు. బుక్ మై షో లాంటి కొన్నింటిని నేను స్వయంగా గమనించిన.. వాళ్లు ప్రభుత్వ అనుమతి పొందలేదు.. అనుమతి పొందకుండా డిసెంబర్​ 31 రాత్రి సన్ బర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి సంబంధించి టికెట్లు విక్రయిస్తున్నారు.  దీనిపై సైబరాబాద్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి” అని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. 

బుక్ మై షో  ఫ్లాట్ ఫామ్​పై ఎంక్వైరీ చేయాలని, అనుమతి లేకుండా ఇలాంటి పార్టీలు చేసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ‘‘ఇలాంటి ఈవెంట్స్ ను ఆదాయ వనరుగా చూడొద్దు. ఇవి యువతను పెడద్రోవ పట్టిస్తున్నయ్​. ఈ ఈవెంట్స్​ను  జల్లెడ పట్టండి. హుక్కా సెంటర్స్, పబ్స్  లో జరిగే వ్యవహారాలు గానీ, ఇట్లాంటి సన్ బర్న్ పార్టీలను గానీ పలు రాష్ట్రాలు నిషేధించాయి. మనం కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎంత పెద్దవాళ్లయినా, వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏమున్నా ఎవ్వరినీ ఉపేక్షించొద్దు.  ఎవ్వరినీ వదిలిపెట్టొద్దు. ఈ విషయంలో  సంపూర్ణంగా పోలీస్ అధికారులకు పవర్స్​ ఇస్తున్న” అని చెప్పారు.