జల మండలికి శారదా పీఠం భూముల కేటాయింపు రద్దు : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

జల మండలికి శారదా పీఠం  భూముల కేటాయింపు రద్దు : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  •     వాస్తవాలు దాచిన అధికారులపై సీఎం ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను యథావిధిగా కొనసాగించాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆదేశించారు. జలమండలికి(వాటర్‌‌‌‌‌‌‌‌ బోర్డు) ఆ భూముల కేటాయింపును రద్దు చేయాలన్నారు. శారదా పీఠం భూముల అంశాన్ని పీఠం ప్రతినిధులు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా రు. స్పందించిన సీఎం శనివారం సాయంత్రం సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 

ఆ భూములను జల మండలికి కేటాయించే సమయంలో వాస్తవాలను దాచారని, అక్కడ జరుగుతున్న నిర్మాణా ల గురించి తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జల మండలికి చేసిన కేటాయింపులను రద్దు చేసి, శారదా పీఠానికే భూములను కొనసాగించాలన్నారు. మంత్రి శ్రీధర్​బాబును కలిసి అక్కడ జరుగుతున్న నిర్మాణాల  గురించి వివరించాలని పీఠం ప్రతినిధులకు సూచించారు.