- స్టార్ క్యాంపెయినర్లుగా ఏఐసీసీ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు ఏఐసీసీ 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో జాబితాను విడుదల చేసింది. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ మంగళవారం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురు కాంగ్రెస్ నేతలకు చోటు దక్కింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
