యాదాద్రి జిల్లాలో నిర్వాసితులకు రూ.300 కోట్లు..రిలీజ్ చేసేందుకు సీఎం హామీ

యాదాద్రి జిల్లాలో నిర్వాసితులకు రూ.300 కోట్లు..రిలీజ్ చేసేందుకు సీఎం హామీ

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో వివిధప్రాజెక్టుల కోసం భూములు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు రూ.300 కోట్లు రిలీజ్​ చేయడానికి సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి తెలిపారు. 

మంగళవారం సీఎం రేవంత్​ రెడ్డిని వారు కలిసి జిల్లాలోని గంధమల్ల, బస్వాపురం, వైటీడీఏ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఆర్​అండ్​ఆర్​ ప్యాకేజీకి సంబంధించి పెండింగ్​లో ఉన్న పరిహారం రిలీజ్​ చేయాలని కోరారు. తక్షణం ఒక్కో ప్రాజెక్టుకు రూ. 100 కోట్ల చొప్పున మొత్తం రూ. 300 కోట్లు చెల్లిస్తే నిర్వాసితులకు ఊరటగా ఉంటుందన్నారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే రిలీజ్​ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.