బీఆర్ఎస్ ను తొక్కినం, బీజేపీని తొక్కుదం... సీఎం రేవంత్

బీఆర్ఎస్ ను తొక్కినం, బీజేపీని తొక్కుదం... సీఎం రేవంత్

తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జాతీయ ఎన్నికల మ్యానిఫెస్టోను తెలంగాణ నుంచి రాహుల్​ గాంధీ విడుదల చేయడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్​ అన్నారు.  బీఆర్​ఎస్​ ను తొక్కిన ఉత్సాహంతోనే బీజేపీను కూడా ఓడించాలన్నారు.  తుక్కుగూడ నుంచి జాతికి 5 గ్యారంటీలను అంకితం చేశారన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్​ జండా ఎగురబోతుందన్నారు.,  

తెలంగాణ మొత్తం తుక్కు గూడకు పోటెత్తిందంటూ.. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు.  న్యాయం కోసం రైతులు రోడ్డెక్కితే... అణగదొక్కారన్నారు. పదేళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసిందన్నారు.   మతం పేరుతో చిచ్చు పెట్టి మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నారని రేవంత్​ అన్నారు.హైదరాబాద్​ కు వరదలు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి ఎక్కడున్నాడని ప్రశ్నించాడు.

పదేళ్లు కేసీఆర్​ తెలంగాణను నాశనం చేశారని సీఎం రేవంత్​ అన్నారు.  కేసీఆర్​  చర్లపల్లి జైలులో డబుల్​ బెడ్​ రూం ఇల్లు కట్టిస్తానన్నారు సీఎం రేవంత్​. ఆ మధ్య కుక్కలు మొరిగాయి... ఇప్పుడు నక్క బయలు దేరింది.. కూతురు జైలుకు వెళ్లింది.. కాలు విరిగిందని ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదంటూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ భాష సరిగా లేదన్నారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోనన్నారు. నేను జానారెడ్డిని కాదు.. రేవంత్​ రెడ్డినంటూ... మా 100 రోజుల పాలన నచ్చితే 14 పార్లమెంట్​ సీట్లను గెలిపించాలని కోరారు.