
తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.పదేళ్లు కేసీఆర్ తెలంగాణను నాశనం చేశారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని, జైల్లో చిప్పకూడు తినిపిస్తామని అన్నారు సీఎం రేవంత్. ఆ మధ్య కుక్కలు మొరిగాయి... ఇప్పుడు నక్క బయలు దేరింది.. కూతురు జైలుకు వెళ్లింది.. కాలు విరిగిందని ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదంటూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భాష సరిగా లేదన్నారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోనన్నారు. నేను జానారెడ్డిని కాదు.. రేవంత్ రెడ్డినంటూ... మా 100 రోజుల పాలన నచ్చితే 14 పార్లమెంట్ సీట్లను గెలిపించాలని కోరారు.