
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు సం బంధించి జీవో 9, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికా రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. అడ్వొకేట్ జనరల్, ప్రముఖ న్యాయవాది అభి షేక్ సింఘ్వీతోనూ హైకోర్టు స్టే, ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇవ్వడంపై చర్చించా రు. ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై లీగల్ ఓపీనియన్ తీసుకున్నారు.
సుప్రీంకోర్టుకి వెళ్లి హైకోర్ట్ ఇచ్చి న స్టేను వెకేట్ చేయించడమా.. లేదంటే హైకోర్టులోనే తేల్చుకోవాలా అనే దానిపై చర్చించారు. ఇప్పటికే స్థానిక పాలక వర్గాలు లేకపోవడంతో 20 నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు నిలిచిపోయాయి. దీంతో పాత రిజర్వేషన్లతోనే ముందుకు వెళ్తూ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం కల్పించే అంశంపైనా చర్చించారు.