
- హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, సీపీఐ నేత డి.రాజా
హైదరాబాద్, వెలుగు: సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ శనివారం జరగనుంది. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఉదయం 11 గంటలకు సీపీఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సంస్మరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరు కానున్నారని పేర్కొన్నారు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, వివిధ రాజకీయ, వామపక్ష పార్టీల నాయకులు, మేధావులు హాజరు అవుతారని వెల్లడించారు.