మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం: సీతక్క

మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం: సీతక్క

తెలంగాణలో మహిళలను కోటీశ్వర్లు చేయాలనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ(SERP).. గ్రామీణభివృద్ధి సంస్థకు సంబంధించిన ఎస్ హెచ్ జీ బ్యాంకు లింకేజీ 2024-25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసింది.  2024, జూన్  15వ తేదీ జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..  ఒక మహిళ ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఆంక్షలు విధిస్తారని.. మారుతున్న జీవన ప్రాణాలకు అనుకునంగా మనం కూడా మారాలని చెప్పారు.  మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.20 వేల కోట్లు  వడ్డీలేని రుణాలను ఇస్తున్నామని తెలిపారు.  రూ.10 వేల నుంచి రూ. లక్షలల్లో లోన్స్ తీసుకునే స్థాయికి మహిళలు చేరుకోవాలన్నారు.  పొదుపు అనేది భద్రత, బాధ్యత అని చెప్పారు.

సాధారణంగా పేదవాళ్లను బ్యాంకర్స్ నమ్మరని.. అలాంటి పేదవాళ్లకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి చెప్పారు. ఫారెస్ట్ ఏరియాలో లాంటి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని మహిళలు ఎక్కువ వెనుకబడి ఉంటారన్నారు.  స్థానిక ప్రాంతాల్లో ఉండే.. అవసరాలకు అనుగుణంగా వ్యాపారం చేయాలని చెప్పారు మంత్రి.

ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో సోలార్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని సీతక్క తెలిపారు. 50 నుంచి 70 రూపాయలకు స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ ధరలు పెంచి రూ.50 కోట్లు మహిళలకు ఇచ్చామని చెప్పారు. పేదరిక నిర్ములన కోసం.. పేదలకు ఏం చేస్తే మేలు జరుగుతదో బ్యాంకర్స్ ఆలోచించాలని ఆమె సూచించారు.  మహిళలను ముందుకు తీసుకురావాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. బ్యాంకర్స్, ప్రభుత్వం ఇద్దరు సాయం చేస్తేనే పేదరిక నిర్మూలన జరిగుతుందని మంత్రి సీతక్క అన్నారు.