
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టుపై ఆదివారం (ఆగస్టు 31) అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ పై మాట్లాడిని మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
తమకు చట్టబద్దంగా నోటీసులు ఇవ్వలేదని.. ఘోష్ కమిషన్ విచారణ నిష్పక్షపాక్షికంగా జరిగిందని మాకు నమ్మకం లేదు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు..మాపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని హరీష్ రావు ఆరోపించగా.. కమిషన్ల కోసమే ప్రాణహిత ప్రాజెక్టు ప్రాంతాన్ని మార్చారు.. ప్రాణహిత, చేవెళ్లకు అన్ని అనుమతులున్నా. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగానే మార్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తప్పులను బయటపెట్టారు కాబట్టే..జస్టిష్ ఘోష్ కమిషన్ రిపోర్టును తప్పుబడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజాయితీపరులై ఏ విచారణ కావాలి..సిట్, సీఐడీ, సీబీఐ, ఇందులో మీకు ఏ విచారణ కావాలో మీరే తేల్చుకోండి అని హరీష్ రావుకు కౌంటరిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రాణహిత, చేవెళ్లలో నీళ్లున్నాయని అప్పటి కేంద్రమంత్రి చెప్పారు..205టీఎంసీల నీళ్లు ఉన్నాయని..హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందని ఉమాభారతి లేఖ కూడా ఇచ్చారు.. హరీష్ రావు ఎండార్స్ చేసిన లేఖ ఇదిగో అంటూ సభ ముందుంచారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రాణహితలో నిళ్లు ఉన్నాయని 2009లోనే CWC లేఖ ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాణహిత ప్రాజెక్టు కట్టుకోవచ్చని 2009లో కేంద్ర ప్రభుత్వం చెప్పినా.. గత ప్రభుత్వం పట్టించుకోకుండా.. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని మార్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తప్పులను బయటపెట్టారు కాబట్టే..జస్టిష్ ఘోష్ కమిషన్ రిపోర్టును తప్పుబడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజాయితీపరులై ఏ విచారణ కావాలి..సిట్, సీఐడీ, సీబీఐ, ఇందులో మీకు ఏ విచారణ కావాలో మీరే తేల్చుకోండి అని హరీష్ రావుకు కౌంటరిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.