పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు సీఎం బర్త్ డే గ్రీటింగ్స్

పీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్కు సీఎం బర్త్ డే గ్రీటింగ్స్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్​కు  సీఎం రేవంత్ రెడ్డి బర్త్​డే విషెస్​ తెలిపారు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆదివారం ట్వీట్​లో పేర్కొన్నారు.

మీ నాయకత్వంలో భవిష్యత్​లో కాంగ్రెస్ పార్టీ మరింత బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి, తిరుగులేని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.