నిర్మాణాలు అక్రమమైతే మీరే కూల్చేసుకోండి: సీఎం రేవంత్​

నిర్మాణాలు అక్రమమైతే మీరే కూల్చేసుకోండి: సీఎం రేవంత్​
  • కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నా వెకేట్​ చేయిస్తం
  • చెరువులను చెరబట్టినోళ్లు చెరసాలకే..
  • మీ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ నీళ్లను ప్రజలు తాగాల్నా?
  • అక్రమార్కుల వెన్నులో చలిజ్వరం పుట్టేలా హైడ్రా పనిచేస్తది
  • మూసీ నిర్వాసితులందరికీ డబుల్​ బెడ్​రూం ఇండ్లు
  • కాస్మొటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ కావాలె
  • పోలీసుల పిల్లల కోసం 2  రెసిడెన్షియల్​ స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఈ ఏడాది మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి
  • ఎస్సై, ఏఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముఖ్యమంత్రి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: చెరువులు, నాలాలను ఆక్రమించి కట్టిన  నిర్మాణాలను ఎవరికివాళ్లు స్వచ్ఛందంగా కూల్చివేసుకోవాలని, లేదంటే తామే కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి​ హెచ్చరించారు. చెరువులు, నాలాలను చెరబట్టే వాళ్ల ఒంట్లో వణుకు, వెన్నులో చలి జ్వరం పుట్టేలా హైడ్రా పనిచేస్తుందని, ఈ  విషయంలో వెనక్కి తగ్గేదేలేదని అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం 547 మంది సబ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్​కు రేవంత్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ‘‘చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి. 

వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అందుకే చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం. అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకూ వెనకాడం. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదలాలని ఆక్రమణదారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే  చెరువుల్లోని నాలాలపై అక్రమ నిర్మాణాలను మేమే నేలమట్టం చేసి తీరుతాం. కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నా  వెకేట్​ చేయించి. మరీ  కూల్చేస్తాం. ఎఫ్టీఎల్, బఫర్  జోన్ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదు’’ అని  స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీసులు పోషించాల్సిన పాత్రపై దిశానిర్దేశం చేశారు. 

అట్లయితే నేను ఫెయిలైనట్టు కాదా? 

“నిజాం కాలం నుంచి హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గండిపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా హైదరాబాద్​వాసులకు తాగునీరు అందుతున్నది. కానీ ఈ రెండు జలాశయాల చుట్టూ కొందరు శ్రీమంతులు  ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కట్టుకొని, వాళ్ల డ్రైనేజీ నీళ్లను జలాశయాల్లోకి వదులుతున్నారు.. అలాంటి నీటిని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను ఫెయిలైనట్టు కాదా?’’ అని సీఎం రేవంత్​ అన్నారు.

‘‘భవిష్యత్‌‌‌‌‌‌‌‌ తరాలకు ఉపయోగపడాల్సిన చెరువులు, కుంటలు నాలాలాను ఎవరెవరో ఆక్రమించుకుంటే  నగరంలో ఉప్పెనలా వరదలు వస్తున్నాయి. ఆ మురికి నీళ్లు బస్తీల్లో ఉన్న పేదల ఇండ్లలోకి వెళ్తున్నాయి. పేదోళ్లు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న వస్తువులు, ఫ్రిజ్​లు, టీవీలు, కట్టుకున్న బట్టలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. వారంతా అనాథల్లా అర్ధరాత్రి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి” అని సీఎం పేర్కొన్నారు. మూసీ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా రైతులు ఏడుస్తున్నారని, అక్కడి పంటలు కూడా విషమయమయ్యాయని, ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పదేపదే తమ దృష్టికి తీసుకొస్తున్నారని సీఎం గుర్తుచేశారు. అందుకే మూసీ నది వెంట ఉన్న ఆక్రమణలను తొలగించి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. దీని వల్ల దాదాపు 12వేల మంది నిర్వాసితులవుతారని, వారందరికీ డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌ ఇండ్లు కట్టించి పునరావాసం కల్పిస్తామని, నది వెంట వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ప్రకటించారు.

పోలీసు సంక్షేమానికి కట్టుబడి ఉన్నం 

పోలీసు సంక్షేమానికి తమ సర్కారు కట్టుబడి ఉన్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. సైనికుల పిల్లలకు ఉన్నట్టుగానే తెలంగాణలో పనిచేస్తున్న హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారి పిల్లల కోసం రెసిడెన్షియల్​ పోలీస్  స్కూల్స్​ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలీసుల పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని 150 ఎకరాల గ్రేహౌండ్స్ భూమిని  కబ్జాదారులు ఆక్రమించుకోవాలని చూశారని, అందులో పోలీస్​రెసిడెన్షియల్​ స్కూల్‌‌‌‌‌‌‌‌ కోసం 50 ఎకరాలు కేటాయిస్తున్నట్టు చెప్పారు. వరంగల్‌‌‌‌‌‌‌‌లో మరో స్కూల్‌‌‌‌‌‌‌‌ కోసం 50 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు.  కొత్తకోట శ్రీనివాస్​రెడ్డికి విజిలెన్స్ అండ్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ మెంట్ బాధ్యతలు అప్పగించామని,  ఆయనతో డీజీపీ చర్చించి.. స్కూల్స్​​ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాబోయే రెండేండ్లలోనే పోలీస్ స్కూల్స్ ఉండాలని అన్నారు. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు అందరు పోలీసుల పిల్లలు ఈ స్కూల్స్‌‌‌‌‌‌‌‌లోనే తారతమ్యం లేకుండా చదువుకోవాలని పేర్కొన్నారు. 


టీజీపీఎస్సీపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాల్లేవ్​

యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని, కానీ, గత ప్రభుత్వంలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణలో నిరుడు డిసెంబర్​3న ప్రజాపాలన మొదలైంది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక 3 నెలల్లోనే 30వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకపత్రాలిచ్చాం. ఈ ఏడాది చివరలోగా మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తం. టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేశాం. ఎలాంటి పేపర్​లీకేజీలు లేకుండా పారదర్శకంగా నియామకాలు జరుపుతున్నాం. కమిషన్​పై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవు. నిరుద్యోగులు ఉత్సాహంగా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వారి వినతి మేరకే గ్రూప్​–2ను వాయిదా వేశాం. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో వ్యసనాలకు తావులేదు. కులవృత్తులతోపాటు చేతివృత్తులను బలోపేతం చేస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా 28 రోజుల్లోనే 22 లక్షల 22 వేల 685 మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేశాం. రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరుగుతున్నారు. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండుగ అని నిరూపించాం”  అని సీఎం పేర్కొన్నారు.  

క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు

కాస్మొటిక్​ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదు.. కాంక్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరమని, ఖాకీ డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. క్రిమినల్స్​తో ఫ్రెండ్లీ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​ఉండదని చెప్పారు. తెలంగాణ పోలీస్​ అకాడమీలో క్రీడా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 24 మంది ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ కేడెట్లకు ట్రోఫీలను అందించారు. ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన పిల్లి భాగ్యశ్రీ, జీ సౌమ్య, ఎమ్. జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  రివాల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీని బహూకరించారు. “పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగం అంటే భావోద్వేగం. కొత్తగా విధుల్లో చేరబోతున్న యువ పోలీసులు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. మాదక ద్రవ్యాల మాట వింటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేయాలి” అని సీఎం దిశానిర్దేశం చేశారు.