ఉపాధ్యాయులు తేనెటీగలాంటి  వాళ్లు.. ఏ ప్రభుత్వానికైనా భయమే: సీఎం రేవంత్

ఉపాధ్యాయులు తేనెటీగలాంటి  వాళ్లు.. ఏ ప్రభుత్వానికైనా భయమే: సీఎం రేవంత్

ఉపాధ్యాయులు తేనెటీగలాంటి వాళ్లని..  టీచర్ల జోలికి వెళ్లేందుకు ఏ ప్రభుత్వామైనా భయపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రమోషన్లు కల్పించిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీచర్ల పాత్రను ఎవరూ కాలేనలేరని అన్నారు. 

ప్రత్యేక రాష్ట్రంలోనైనా విద్యా విధానం బాగుపడుతోందని ఆశించాం.. కానీ  పోరాడి  సాధించుకున్న తెలంగాణలో ఉపాధ్యాయులకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పడేండ్లుగా ఉపాధ్యాయుల  సమస్యలు పట్టించుకున్నారా అని గత బీఆర్ఎస్  సర్కార్ పై నిప్పులు చెరిగారు.  పేద వాడికి ఉన్నత విద్య అందినప్పుడే రాష్ట్రం బాగుపడుతోందన్నారు.

విద్యకు రూ.21 కోట్లకు పైగా బడ్జెట్ లో కేటాయించామని  పేర్కొన్నారు. విద్యకు 10 శాతానికి పైగా నిధులు ఇవ్వాలని తొలుత భావించామని కానీ  గత ప్రభుత్వం చేసిన అప్పులతో అది సాధ్యం కాలేదని  స్పష్టం చేశారు.  ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయో మాకు తెలుసన్నారు. పదేండ్లలో టీచర్లకు ఏనాడైనా ఫస్ట్  తారీఖే జీతాలొచ్చాయా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తు్న్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులు పరిస్థితులు దిగజారాయి.. 20 ఏండ్లుగా భాషా పండితులకు ప్రమోషన్లు లేవని మండిపడ్డారు. చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం సమస్యల  పరిష్కారానికి ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. 30 వేల పాఠశాలల్లోనే తెలంగాణ భవిష్యత్ దాగి ఉందన్నారు. 

టీచర్లే మా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు:

టీచర్లే తమ కాంగ్రెస్ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులకు పాఠశాళ పారిశుధ్య బాధ్యతలు అప్పగించామని తెలిపారు. టీచర్ల ఎవరూ సొంత డబ్బులతో హెల్పర్లను పెట్టుకోవద్దని సూచించారు.  రాష్ట్రంలో ఉన్న 30 వేల పాఠశాలలకు  ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. మైరుగైన విద్య అందించినందుకే కేజ్రీవాల్ ఢిల్లీలో మళ్లీ గెలిచారని అభిప్రాయ పడ్డారు. మా ప్రభుత్వం మళ్లీ ఏర్పాడాలన్నా.. టీచర్ల సహకారం ఎంతో అవసరమని అన్నారు. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చామని,  రూ.150 కోట్లతో యంగ్ ఇండియా  స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేశామని వెల్లడించారు. తులసీవనం లాంటి రాష్ట్రంలో గంజాయి మొక్కలను పీకేస్తామన్నారు.