
హైదరాబాద్, వెలుగు: కార్గిల్ విజయ్ దివ స్‌ను పురస్కరించుకొని శనివారం జూబ్లీహి ల్స్లోని తన నివాసంలో కార్గిల్ యుద్ధ వీరుడు, 18 గ్రెనేడియర్స్ కర్నల్ జాయ్ దాస్ గుప్తాను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను సాయుధ దళాల్లో చేరడానికి ప్రోత్సహించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, మార్గాలపై సీఎం రేవంత్‌తో చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో మేజర్‌గా ఉన్న జాయ్ దాస్‌గుప్తా.. పాకిస్తాన్ దళాలు తిష్టవేసిన తోలోలింగ్ కొండను స్వాధీనం చేసుకునే ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు.
హైద రాబాద్ వాసి అయిన కర్నల్ దాస్‌గుప్తా, వెస్లీ కాలేజీలో ఇంటర్ విద్యనభ్యసించి, ఉస్మాని యా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడ మీలో శిక్షణ పొంది, మే 1995లో సైన్యంలో కి ప్రవేశించారు. రెండు ఆర్మీ కంపెనీలకు నాయకత్వం వహించినందుకు ఆయనకు సేవా పతకం లభించింది. ఈ కార్యక్రమంలో దాస్‌గుప్తా తన 80 తల్లితో కలిసి పాల్గొన్నారు.