పెద్దపల్లి మైనర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

పెద్దపల్లి మైనర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీ రవి గుప్తాకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు చేశారు.  పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ రేప్ ఘటనపై పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.  ఫోక్స్ చట్టంతో పాటు కేసు విచారణ త్వరగా చేసి ఛార్జ్  షీట్ దాఖలు చేయాలని చెప్పారు సీఎం.  నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు.   నారాయణపేట ఉట్కూర్ లో జరిగిన మర్డర్ పై  కూడా సీఎం రేవంత్ ఆరా తీశారు.  పోలీసుల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పారు సీఎం.   ఉట్కూరు  లో వ్యవహారంపై దర్యాప్తు చేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.  

 పెద్దపల్లి జిల్లాలో గురువారం ఆరేళ్ల బాలికను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో కూలీగా పనిచేసే మైనర్ తన తల్లితో కలిసి రైస్ మిల్లు బయట నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. బాలికను నిందితుడు బలరాం కిడ్నాప్ చేశాడు. సిసిటివి ఫుటేజీలో బలరామ్ మైనర్‌ను తన భుజంపై ఎక్కించుకుని చీకటి ప్రదేశంలో తీసుకెళ్తున్నట్లుగా కనిపించింది.  అర్ధరాత్రి ఆమె  తల్లి నిద్ర లేచి చూసే సరికి కూతురు కనిపించకుండా పోవడంతో స్థానికులతో కలిసి వెతకడం ప్రారంభించింది.  పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. అనంతరం స్థానికులతో కలిసి కూలీలు బలరాంను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.