గేట్ ఓపెన్ చేశా.. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయితది: సీఎం రేవంత్ రెడ్డి

గేట్ ఓపెన్ చేశా.. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయితది: సీఎం రేవంత్ రెడ్డి

 మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే ఊరుకుంటామా.. కుక్కకాటుకు చెప్పుదెబ్బ తప్పదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  మేము గేట్లు ఓపెన్ చేశామని.. ఇక, బీఆర్ఎస్ లో ఎవరూ ఉండరని.. ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి  వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. 100 రోజుల్లో ప్రజాపాలనను అందించామన్నారు. మా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా పూర్తి కాకముందే.. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూలగొట్టాలనే ఆలోచనతో బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. 

ALSO READ | కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్

ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని.. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని బీజేపీ నేతలు పదే పదే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 సీట్లు ఉన్న బీజేపీ, 39 సీట్లున్న బీఆర్ఎస్.. ఏ విధంగా మా ప్రభుత్వాన్ని  పడగొడుతుందని నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు.  మేము గేట్ ఓపెన్ చేశామని.. ఇక, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ముగ్గురు మాత్రమే ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.