హైదరాబాద్, వెలుగు: ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ వచ్చే నెల డిసెంబర్‌లో భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ను సందర్శించనున్నారు. “ది గోట్(జీఓఏటీ) ఇండియా టూర్ – 2025” లో భాగంగా మెస్సీ హైదరాబాద్ రానున్నట్టు సమాచారం.
ఈ మేరకు తాజాగా ది గోట్ ఇండియా టూర్ ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పోస్టర్ ను విడుదల చేశారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ కార్యక్రమానికి మెస్సీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. మెస్సీ హైదరాబాద్ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు సమాచారం.
