V6 News

గుండెల నిండా అభిమానంతో వచ్చా...ఓయూని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దుతా: సీఎం రేవంత్

గుండెల నిండా అభిమానంతో వచ్చా...ఓయూని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దుతా: సీఎం రేవంత్

 దేశంలోనే ఓయూకి గొప్ప చరిత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ఓయూ గొప్ప చరిత్రను ప్రపంచానికి చాటి చెప్తామన్నారు.   ఓయూతో ఎంతో మంది గొప్ప గొప్ప వారికి అనుబంధం ఉందన్నారు. ఓయూని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దుతానని చెప్పారు రేవంత్. సీఎం హోదాలో రెండోసారి ఓయూలో పర్యటించిన రేవంత్...గుండెల నిండా అభిమానంతో ఓయూకి వచ్చానని చెప్పారు. పెద్దపెద్ద చదువులు చదవుకోలేదన్నారు.  నల్లమల్లలో చదువుకుని ఈ స్థాయికి వచ్చిన తనకు  పేదల బాధలేంటో  తెలుసన్నారు. 

 సీఎం రేవంత్ స్పీచ్ కీలక అంశాలు

  • ఓయూ విద్యార్థులు ఉద్యమకారుల ఆకాంక్షను గుర్తించాం
  • విద్యార్థులు, మేధావుల సూచనలతో క్యాంపస్ అభివృద్ధి చేస్తాం
  • తెలంగాణ భవిష్యత్ కు పునాదులు వేసే యువకులు ఇక్కడ ఉన్నారు
  • ఓయూలో సీఎంలను,మంత్రులను అడ్డుకున్న చరిత్ర ఉంది
  •  ఎందుకెళ్తాన్నారని నన్ను కొందరు అడిగారు
  • మీరు చాలా ధైర్యం చేస్తున్నారని అన్నారు
  • నాది ధైర్యం కాదు..అభిమానం
  • నా తమ్ముళ్లు ఉన్న యూనివర్శిటీకి రావడానికి ధైర్యమెందుకు.?
  • గుండెల నిండా అభిమానం నింపుకుని ఇక్కడకు వచ్చా
  • నాకు ఏది అనిపించిందో అదే మాట్లాడుతానని చెప్పి వచ్చా
  • నల్లమల్ల ప్రాంతంలో సర్కార్ బళ్లో చదువుకుని వచ్చా
  • తెలంగాణ మేధావుల అనుభవంతో వర్శిటీని బాగు చేసుకుందాం
  • గ్లోబల్ సమ్మిట్ వేదికగా విద్య అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించా
  •  ఇక్కడ భూమి, గాలికి, నీళ్లకు పౌరుషం ఉంది
  • తెలంగాణ  ప్రజలు ఆధిపత్యాన్ని ఎన్నడూ సహించరు
  • ఆధిపత్యం చేస్తే ఉద్యమం పుట్టుకొస్తుంది
  • ఓయూలోనే తొలిదశ తెలంగాణ ఉద్యమం పుట్టింది
  • ఓయూని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాలనేదే నా లక్ష్యం
  • అడవిలో పుట్టిన ఆనాటి పాలకులు గడగడలాడించారు
  • భూమి కోసం, భుక్తి కోసం విముక్తి కోసం పోరాడిన చరిత్ర మనది
  • గతంలో ఇక్కడి విద్యార్థులు అడవి బాట పట్టారు.
  • రాజకీయ ఉద్దండులు జైపాల్ రెడ్డి, జార్జిరెడ్డి ఇక్కడే చదువుకున్నారు
  • దేశానికి ఆర్థిక మేధావి పీవీని అందించింది
  • స్వేచ్ఛ సమానత్వం కోసం విద్యార్థులు పోరాడారు
  • ప్రపంచానికే దిక్సూచిగా ఉస్మానియా విద్యార్థులు మారాలి
  • గొప్ప చరిత్ర ఉన్న ఓయూను కాలగర్భంలో కలపాలని కొంతమంది కుట్ర చేశారు
  • సర్కార్ బడుల్లో చదువుకున్న నాకు పాలన రాదన్నారు
  • చిన్నప్పటి నుంచి అన్ని వర్గాలతో కలిసి పెరిగా వారి సమస్యలు తెలుసు
  • పేదరికం అంటే కార్లలో వెళ్లి చూస్తేనే వాళ్లకు అర్థమవుతుంది
  • గుంటూరు,అమెరికాలో చదువుకున్నామని గొప్పలు చెప్పారు
  • నేను గుంటూరులో చదవలేదు..గూడు పుఠానీ తెల్వదు.. బెంజ్ కార్లతో తిరగలేదు
  • నాకు గొప్ప భాష రాకపోవచ్చు..కానీ జనం బాధలు తెలుసు
  •  ఓయూకు వెళ్లాలని ఒకాయన సవాల్ విసిరారు
  • ఆయన లాగా  నేను  దొంగను కాదు,ఫామ్ హౌస్ లు లేవు
  • జడ్పీటీసీ నుంచి ఈ స్థాయికి వచ్చా
  • బహుజనుల తల్లిగా తెలంగాణ తల్లిని రూపొందించాం
  • మీరు తొక్కి పెట్టిన తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్చా
  • ఆలు మగల ఫోన్లు వినడానికి కమాండ్ కంట్రోల్ కట్టుకున్నారు
  • దళితులకు మూడెకరాలిస్తామని మోసం చేశారు
  • బీఆర్ఎస్ నేతలు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు
  • గుంటూరులో చదువుకున్న వాళ్లకు పేదరికం తెల్వదు
  • వాళ్లు పేదరికం చూడాలంటే ఎక్స్ కర్షన్ వెళ్లారు
  • అభివృద్ధి అంటే అద్దల మేడలు ,రంగుల గోడలు కాదు
  • వందల ఎకరాలున్నా..చదువు లేకపోతే వృధానే
  •  చదువు ఉంటేనే సమాజంలో గుర్తింపు
  • సమాజానికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం
  • వివక్షను తరిమేయాలంటే విద్య అవసరం

  •