ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

తెలంగాణ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు వారి శాఖలపై సంబంధిత అధికారులతో సమీక్షించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి.. విద్యుత్,  ధరణి, టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగ నియామకాలు, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలపై సమీక్షించారు. 

డిసెంబర్ 17వ తేదీ ఆదివారం సాగునీటి పారుదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి.. ఇరిగేషన్ అధికారులతో సమావేశమై చర్చించారు. నాగార్జున సాగర్‌ ఆయకట్టు కింద రెండో పంటకు నీటి విడుదల, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై అధికారులతో చర్చ జరిపారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.