తెలంగాణకు పదేండ్లు నేనే సీఎం: సీఎం రేవంత్ రెడ్డి

 తెలంగాణకు పదేండ్లు నేనే  సీఎం: సీఎం రేవంత్ రెడ్డి

పదేండ్లు తెలంగాణకు తానే సీఎంగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు. ఢిల్లీలో నేషనల్ మీడియాతో మాట్లాడిన  ఆయన. తాను హైదరాబాద్ గాంధీభవన్ లో డీసీసీలను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఎడిట్ చేశారని అన్నారు. దేవుళ్లపై తన వ్యాఖ్యలను ఎడిట్ చేసి  ట్రోల్ చేస్తునారని మండిపడ్డారు. దేవుళ్లను కించపర్చేలా తానెక్కడా మాట్లాడలేదని అన్నారు. 

తన వ్యాఖ్యల ముందు, వెనుక ఉన్న అంశాలను కూడా పరిశీలించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజం లాంటిదని చెప్పానని, అందరినీ కలుపుకొని పోవాలనే చెప్పే క్రమంలో దేవుళ్లను ప్రస్తావించానని అన్నారు.పార్టీలో సంస్థాగతంగా తీసుకు రావాల్సిన మార్పులు, స్థానిక ఎన్నికల వేళ వ్యవహరించాల్సిన తీరుపై డీసీసీల సమావేశంలో తాను మాట్లాడినట్లుగా వివరణ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకపోవడంతోనే బీజేపీ దీనిని వివాదం చేస్తోందన్నారు. ఏది ఏమైనా ఉత్తరాదిలో కూడా తనను బీజేపీ నేతలు పాపులర్ చేస్తున్నారని సీఎం అన్నారు.