
రైతు రుణమాఫీతో జన్మ ధన్యమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ రెండోవిడతలో భాగంగా లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేశారు రేవంత్ రెడ్డి. 6లక్షల 40 వేల మంది రైతుల ఖాతాల్లోకి 6190 కోట్ల నిధులను జమ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందన్నారు.తమది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. సోనియా, రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు.
మొదటి విడతలో 11లక్షల 34 వేల 412 మంది రైతుల ఖతాల్లో 6 వేల కోట్లు రుణమాఫీ చేశారు. ఇవాళ రెండో విడతలో 6లక్షల40 వేల 823 మంది రైతుల ఖాతాల్లో 6 వేల 90 కోట్లు జమ అయ్యాయి. మొత్తం రెండు విడతల్లో కలిసి 17లక్షల 75 వేల235 మంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండు విడతల్లో 12 వేల 224 కోట్లు జమ చేశారు.
Also Read:-హైదరాబాద్ లోనూ 4 రైతులకు రుణమాఫీ.. ఏయే జిల్లాలో ఎంత మందికి.. ఎంత మాఫీ అంటే..
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్
- సోనియా, రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ
- వ్యవసాయం దండుగ కాదు..వ్యవసాయం పండుగ అని నిరూపిస్తున్నాం
- రెండో విడత రుణమాఫీ చేస్తున్నాం
- రుణమాఫీతో రైతులంతా సంబరం చేసుకుంటున్నారు
- ఎమ్మెల్యే పార్టీలకు అతీతంగా పాల్గొనడం సంతోషకరం
- రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనం అని పాల్గొన్నారు
- కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొనడం సంతోషకరం
- రుణమాఫీ చేయడంతో నా జన్మ ధన్యమైంది
- వ్యాపారంలో నష్టమొచ్చిందని చెప్పి దేశం వదిలి పారిపోతున్నారు
- కానీ రైతు మాత్రం తీసుకున్న అప్పు మాత్రం కట్టకుండా వదిలి పెట్టడు
- క్రాప్ లోన్ తీసుకొచ్చి పంటకు పెట్టుబడి పెడితే.. పండించిన పంటకు గిట్టుబాటు రాకున్నా అప్పు చెల్లిస్తాడు
- రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- రైతులు ఆర్ధిక సంక్షోభంలో కురుకుపోవద్దని రైతు రుణమాఫీ హామీ ఇచ్చాం.. చేస్తున్నాం
- మేము హామీ ఇచ్చినప్పుడు అప్పటి సర్కార్ పెద్దలు నవ్వుకున్నారు
- ధనిక రాష్ట్రంలో కూడా రైతులకు న్యాయం జరగలేదు
- నిధులున్నా గత బీఆర్ఎస్ సర్కార్ రైతులకు న్యాయం చేయలేదు
- పదేళ్లలో 25 వేల కోట్లను మాఫీ చేయలేకపోయారు
- కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుంది
- ఇది మా పాలన చిత్తశుద్ధి
- కావాలనే కొందరు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు
- రైతు ఎంత నష్టం వచ్చినా వ్యవయసాయాన్ని వదలడం లేదు
- రైతుల మేలు కోసం వరంగల్ రైతు డిక్లరేషన్
- ఆహారభద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్..ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్
- పంటల బీమాను తీసుకొచ్చింది కాంగ్రెస్
- మా చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించాల్సిన అవసరంలేదు
- కాంగ్రెస్ ఎప్పుడూ రైతు పక్షమే
- తుక్కగూడలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం కృషి చేస్తాం
- ఓట్ల కోసమే ఎన్నికల కోసమో రుణమాఫీ చేయడం లేదు
- దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం 2 లక్షల ఒకే సారి రుణమాఫీ చేశాం
- ఇది మా ప్రభుత్వ చరిత్ర
- గత సీఎం చేసిన అప్పులకు మేం వడ్డీలు కడ్తున్నాం
- ఆరు నెలల్లో 26 వేల కోట్ల అప్పులు కట్టినం
భట్టి విక్రమార్క కామెంట్స్
- రెండో విడత రైతు రుణమాఫీ సంతోషాన్ని ఇచ్చింది
- మాది రైతు ప్రభుత్వం
- రుణమాఫీతో రైతులకు రుణ విముక్తి
- కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది
- ఇప్పటి వరకు రెండు విడతల్లో 12 వేల 224 కోట్ల రుణమాఫీ
- వరంగల్ సభలో మాట ఇచ్చాం..నిలబెట్టుకున్నాం
- గత ప్రభుత్వం లక్ష కూడా రుణమాఫీ చేయలేకపోయింది
- 2 లక్షల రుణమాఫీ అంటే సాధ్యం కాదన్నారు.
- ప్రభుత్వానికి ఇది సంతోషకరమైన రోజు
- గత సర్కార్ రైతుల్ని పట్టించుకోలేదు
- రుణమాఫీయే కాదు రైతు భీమా కూడా అమలు చేస్తాం
- ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాం
- ప్రతీ క్షణం ఈ ప్రభుత్వం రైతుల మేలు కోసం పరితపిస్తోంది
మంత్రి తుమ్మల కామెంట్స్
- కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది
- రైతులకిచ్చిన హామీపై కట్టుబడి ఉన్నాం
- 2 లక్షల రుణమాఫీ హామీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు
- ఇవాళ లక్షన్నర లోపు రుణమాఫీ
- ఇప్పటికే లక్షలోపు రుణమాఫీ పూర్తి చేశాం
- రెండో విడతలో 6 లక్షల 40 వేల మందికి లబ్ధి
- గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో 70 వేల కోట్లు రుణమాఫీ చేశాం
- అదే తరహాలో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నాం
- గత ప్రభుత్వం పంటల భీమా ఎత్తేసింది
- త్వరలోనే రైతు భరోసా విధివిధానాలు తీసుకొస్తాం