ఆరు గ్యారంటీలు: గ్రామ సభల తర్వాత కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు..

ఆరు గ్యారంటీలు:  గ్రామ సభల తర్వాత కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు..

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  తెలంగాణ  సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అభయహస్తం లోగోను  ఆయన అవిష్కరించారు .  డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభల్లో ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందన్నారు.   ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.  

అర్హులందరూ దరఖాస్తులు పెట్టుకోవాలని సూచించారు. ప్రతీ మండలంలో రెండు గ్రూపులుంటాయని..ఒకటి..ఎండీవో..మరొకటి ఎమ్మార్వో అని చెప్పారు.  గ్రామసభల్లో మహిళలకు, పురుషులకు సపరేట్ కౌంటర్లు ఉంటాయని తెలిపారు.  గ్రామసభల్లో దరఖాస్తు పెట్టుకోలేని వాళ్లు తహసీల్దార్, MPDO ఆఫీసుల్లో దరఖాస్తులు పెట్టుకోవాలని తెలిపారు.   ప్రజావాణిలో వేల ధరఖాస్తులు వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ఎక్కువుగా భూ సమస్యలే ఉన్నాయని చెప్పారు.  ప్రభుత్వానే ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.