కేటీఆర్ బరితెగించి మాట్లాడుతుండు.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తది

కేటీఆర్ బరితెగించి మాట్లాడుతుండు.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తది

ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 29వ తేదీ శుక్రవారం గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి.. వాల్మీకి బోయలతో సమావేశమర్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వాల్మీకి బోయల డిమాండ్ ను నెరవేరుస్తామని... అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువబోతున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

తొలిసారి ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. "గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తో దుర్మార్గం చేసింది. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ మంది సంసారాల్లో వేలు పెట్టాడు. కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ సిగ్గు లేకుండా చెబుతున్నాడు.
ఫోన్లు వినేందుకు వీళ్లకేం పని.. ఎవరైనా బరితెగించి ఇలా మాట్లాడుతారా?. ఏమైతదంటే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది. కేసీఆర్ చెప్పినట్లు విని కొంతమంది అధికారులు ఊచలు లెక్కబెడుతున్నారు. అధికారులకు మేం ముందే చెప్పినా వినలే. మున్ముందు దాని ఫలితం దానికి ఉంటుంది.  గత ప్రభుత్వం ఓట్లేసిన ప్రజలపైనే కేసులు పెట్టింది" అని చెప్పారు.