పార్టీ కోసం, కార్యకర్తల కోసం దామన్న ఆస్తులు అమ్ముకున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

పార్టీ కోసం, కార్యకర్తల కోసం దామన్న ఆస్తులు అమ్ముకున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం ( అక్టోబర్ 12 ) తుంగతుర్తిలో జరిగిన సంతాప సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం దామన్న సేవలందించారని అన్నారు. నమ్ముకున్న కార్యకర్త కోసం దామన్న ఎంతో చేశారని.. పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఆస్తులు అమ్ముకున్నారని అన్నారు.

దామోదర్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా సేవలందించారని.. కార్యకర్తలపై దాడులు జరిగితే అండగా నిలబడ్డారని అన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ జెండాను సగర్వంగా నిలబెట్టారని అన్నారు సీఎం రేవంత్. దశాబ్దాలుగా పార్టీకి కేరాఫ్ గా దామన్న ఉన్నారని అన్నారు. కరువు ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చిన ఘనత దామన్నది అని అన్నారు సీఎం రేవంత్. ఫ్లోరైడ్ తో అల్లాడుతున్న ప్రాంతానికి మంచినీరు అందించారని..తుంగతుర్తిలో గ్రామగ్రామాన దామన్న అభిమానులు ఉన్నారని అన్నారు సీఎం రేవంత్.

తెలంగాణ టైగర్ గా దామన్న పేరు తెచ్చుకున్నారని అన్నారు సీఎం రేవంత్. సూర్యాపేట, తుంగతుర్తిలో కాంగ్రెస్ ను బలంగా తీర్చిదిద్దారని అన్నారు.గాంధీ కుటుంబం దామోదర్ రెడ్డి ఫ్యామిలీకి అండగా ఉంటుందని సోనియా చెప్పారని అన్నారు. దామోదర్ రెడ్డి మృతికి ఖర్గే, రాహుల్ గాంధీ సంతాప లేఖ పంపారని అన్నారు సీఎం రేవంత్.