
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం(జనవరి 14) మణిపూర్ వెళ్లనున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో నాయ్ యాత్ర ప్రారంభించనున్నారు. మణిపూర్ నుంచి ముంబయి వరకు ఈ యాత్ర కొనసాగనుంది.
రాహుల్ గాంధీ ప్రారంభించనున్న భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు రేపు సీఎం రేవంత్ రెడ్డి మణిపూర్ కు బయల్దేరి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన ఢీల్లీలో ఉన్నారు. ఆదివారం సీఎం రేవంత్.. ఢిల్లీ నుంచి నేరుగా మణిపూర్ కు వెళ్లి యాత్రలో పాల్గొంటారు.
భారత్ జోడో నాయ్ యాత్ర.. జనవరి 14న మణిపూర్ లో మొదలై 66 రోజులు పాటి సాగి ముంబయిలో మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్‌సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ గాంధీ మాట్లాడతారు.