సెప్టెంబర్ 26న అంబర్ పేటలోని బతుకమ్మ కుంట ప్రారంభం

సెప్టెంబర్ 26న అంబర్ పేటలోని బతుకమ్మ కుంట ప్రారంభం
  • బతుకమ్మ వేడుకల్లోనూ పాల్గొననున్న సీఎం రేవంత్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్ పేటలోని బ‌తుక‌మ్మ కుంటను ఈ నెల 26న సీఎం  రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.  అనంతరం బతుకమ్మ ఉత్సవాలు ఇక్కడ జరపనున్నారు. 2,500 మంది బతుకమ్మ ఆడనున్నారు. బతుకమ్మకుంట ప్రారంభోత్సవాన్ని, అక్కడ నిర్వహిస్తున్న ఉత్సవాలను ఆపాలంటూ అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ తో దశాబ్దాలుగా పోరాడుతున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణను అక్టోబర్ 9కి హైకోర్టు వాయిదా వేసింది. 

గతంలోనే అక్కడ పనులు చేసేందుకు అనుమతిచ్చిన హైకోర్టు  ఈ నెల 26న నిర్వహించే  బతుకమ్మ ఉత్సవాల విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.  దీంతో ఉత్సవాలకు లైన్ క్లియర్ అయింది. మంగళవారం బతుకమ్మ కుంట వద్ద పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.