- హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ పనులు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో మహిళా సంఘాల రికార్డు చాలా బాగుందని, అందుకే స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. రెండు అత్యాధునిక అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఎంఆర్‌ఐ మిషన్‌ను వర్చువల్‌గా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్కులు, గోదాములు, రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వీటి కోసం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీఎస్ సంజయ్ జాజు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజీటీపీసీ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
