హైదరాబాద్: ఫుట్ బాల్ లెజెండ్ మెస్సీ హైదరాబాద్కు రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. 15 నిమిషాల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్కు భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి చివరి 5 నిమిషాలు మాత్రమే మ్యాచ్ ఆడనున్నారు. ఎంపిక చేసిన 20 మంది చిన్నారులకు మెస్సీ ట్రైనింగ్, సూచనలు ఇస్తారు. చివరలో మెస్సీ షూట్ ఔట్ ఉంటుంది. సాయత్రం 5 గంటల నుంచి ఉప్పల్ స్టేడియంలో మ్యూజికల్ కన్సర్ట్ జరుగుతుంది.
రాత్రి 7.30 గంటలకు ఫుట్ బాల్ మ్యాచ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి పోలీసులు అనుమతించనున్నారు. ఉప్పల్ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 39 వేలు. ఇప్పటికే ఇండియాకు చేరుకున్న మెస్సీ శనివారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. తాజ్ ఫలక్ నామాలో మెస్సీ బస చేస్తారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు తాజ్ ఫలక్ నామా ప్యాలెస్లో 250 మంది గెస్ట్లతో మీట్ అండ్ గ్రేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అనంతరం 7 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు.
ఈ మ్యాచ్ టికెట్లన్నీ ఆన్లైన్లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానున్నది. మెస్సీ కెప్టెన్‌గా వ్యవహరించే అపార్నా మెస్సీ ఆల్ స్టార్స్ టీమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరించే సింగరేణి ఆర్ఆర్9 టీమ్ ఢీ కొంటుంది. గంట పాటు జరిగే ఈ మ్యాచ్లో చివరి 5 నుంచి నిమిషాల ఆటలో మాత్రమే రెండు టీమ్ల కెప్టెన్లు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ నెంబర్9, మెస్సీ జెర్సీ నెంబర్ 10 ధరిస్తారు. -మెస్సీ టీమ్లో పది మంది అండర్ ప్రివిలేజ్డ్, ఐదుగురు టాలెంటెడ్ ప్లేయర్లు పాల్గొంటారు.
మ్యాచ్ అనంతరం మెస్సీ పాల్గొనే పెనాల్టీ షూటవుట్ కూడా నిర్వహిస్తారు. చారిటీ మ్యాచ్ కోసం ఒక్కో టికెట్ను రూ.2,250 నుంచి రూ.10 వేలకు పైగా ధరలకు ఆన్లైన్లోనే అన్నీ టికెట్లు అమ్మేశారు. ఈ మ్యాచ్ ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్కు ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ఉండటంతో స్టేడియం దగ్గర రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

