ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా తెలుసుకోండి : కేటీఆర్కు సిద్ధరామయ్య పంచ్

ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా తెలుసుకోండి : కేటీఆర్కు సిద్ధరామయ్య పంచ్


బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు కౌంట్ ఇచ్చారు క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి సిద్ధరామ‌య్య. కేటీఆర్ చేసిన ట్వీట్ పై మండిపడుతూ.. కౌంటర్ ఎటాక్ చేశారు సీఎం సిద్ధరామయ్య. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా..? అంటూ కేటీఆర్ ను ట్విట్టర్ లో ప్రశ్నించారు సీఎం సిద్ధరామయ్య. కర్ణాటక సీఎం  సిద్దరామయ్య అసెంబ్లీలో మాట్లాడారంటూ వైరలవుతున్న ఓ వీడియోను మాజీ మంత్రి కేటీఆర్‌ రీపోస్టు చేస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా సిద్దరామయ్య స్పందించారు. అది ఫేక్‌ వీడియో అని కొట్టిపారేస్తూ.. కేటీఆర్‌కు ఘాటుగా బదులిచారు.‘కేటీఆర్‌.. తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓటమిపాలైందో మీకు తెలుసా..? ఎందుకంటే మీరు ఫేక్‌ వీడియో ఏదో.. ఎడిటెడ్‌ వీడియో ఏదో.. నిజమైనదేదో పరిశీలించుకోలేకపోతున్నారు. బీజేపీ ఫేక్‌ వీడియోలను క్రియేట్‌ చేస్తుంది. మీ పార్టీ వాటిని ప్రచారంలోకి తెస్తుంది. మీరు బీజేపీకి నిజమైన బీ టీమ్‌’అంటూ సిద్ధరామయ్య ట్విట్టర్ లో స్పందించారు.

కేటీఆర్ ఏం ట్వీట్ చేశారంటే..? 

అంతకుముందు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికి డబ్బుల్లేవని సిద్ధరామయ్య అంటున్నారు. హామీలు ఇచ్చే ముందు ఆలోచించరా అని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ  భవిష్యత్ కూడా ఇలాగే ఉండబోతుందా..? అని అనుమానం వ్యక్తం చేశారు. ఏ మాత్రం ప్రణాళిక చేయకుండా అసలు హామీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 

ఆ వీడియోలో ఏ ముంది..?  

ఎన్నికల్లో ఓట్ల కోసం  ఏదో అన్నాం అనుకోండి.. అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం.. అంత మాత్రానా అన్ని  ఫ్రీగా ఇవ్వాలనే ఉంది. కానీ డబ్బులు లేవు.. అని అసెంబ్లీలో సిద్ధరామయ్య అన్నట్లు వీడియోలో ఉంది. అయితే తన వీడియో ప్రచారం కావడాన్ని సీఎం సిద్ధరామయ్య ఖండించారు. తాను అలా అనలేదని తన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అశ్వత్ నారాయణ, సి.టి.రవి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తన కామెంట్స్ ను అక్కడక్కడ ముక్కలుగా కట్ చేసి.. ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేశారన్నారు. ఇది డీప్ ఫేక్ వీడియోగా స్పష్టం చేశారు సిద్ధరామయ్య.