
- 20 వేల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించిన సీఎండీ
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో ఇప్పటివరకు 35కి పైగా చిట్టడవులు సృష్టించామని సీఎండీ ఎన్. బలరాం తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సంస్థ అధిక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియాలో 85 హెక్టార్లలో 3.5లక్షలు మొక్కలు నాటేందుకు ప్లాన్ చేశామని చెప్పారు. కొత్తగూడెం ఏరియాలో సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వనమహోత్సవంలో ఆయన పాల్గొని స్వయంగా 225 మొక్కలు నాటారు.
దీంతో ఆయన 20 వేల మొక్కలు నాటిన తొలి సివిల్‌సర్వీసెస్ ఆఫీసర్ గా రికార్డు సృష్టించారు. ఆయనను విశ్వగురు వరల్డ్రికార్డ్స్అవార్డుతో సంస్థ ప్రతినిధులు సన్మానించారు. అనంతరం బలరామ్ మాట్లాడుతూ.. తాను 20 వేల మొక్కలు నాటి రికార్డు నెలకొల్పడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ ఏడాది సింగరేణివ్యాప్తంగా 40 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ప్రధానంగా ఓపెన్ కాస్ట్ ఓవర్బర్డెన్పై పెద్ద ఎత్తున మొక్కలను నాటేందుకు ప్లాన్ చేశామన్నారు. సోలార్ ప్లాంట్లను భారీగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్(పా) గౌతమ్ పోట్రు, డైరెక్టర్లు డి. సత్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, ఎల్వీ సూర్యనారాయణ, కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు, జీఎంలు సుభాని, మనోహర్, సైదులు, సంఘాల నేతలు పాల్గొన్నారు.
మహిళలకు తేనె టీగలు, బాక్సులు పంపిణీ
ప్రభుత్వంతో కలిసి సింగరేణివ్యాప్తంగా స్వయం ఉపాధి పథకాలకు రూపకల్పన చేయనున్నట్టు సీఎండీ ఎన్. బలరాం తెలిపారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాలకు చెందిన ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లోని వంద మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కొత్తగూడెంలోని సంస్థ హెడ్డాఫీస్లో మంగళవారం తేనె టీగల బాక్స్‌లు, తేనెటీగలు, ఇతర పరికరాలను అందించారు.
అటవీ ప్రాంతాలతో పాటు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు తేనె టీగల పెంపకం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్‌తో రైతులు, యువతకు ఉపాధి కల్పిస్తున్నామని కలెక్టర్జితేశ్వి పాటిల్ తెలిపారు.