ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పుపై ప్రధానికి సీఎంల లేఖ

ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పుపై ప్రధానికి సీఎంల లేఖ

ఐఏఎస్ క్యాడర్ రూల్స్ 1954ను మార్చాలన్న కేంద్ర నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన డిప్యూటేషన్ రూల్స్ ను పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం కేంద్రం ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ఐఏఎస్ డిప్యూటేషన్ విషయంలో కేంద్రం ప్రతిపాదించిన మార్పులు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నియమావళికి లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన కొనసాగేలా చూడాలని ఆయన  ప్రధానికి రాసిన లేఖలో కోరారు. ఈ అంశంపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తదితరులు ఇప్పటికే ప్రధానికి లేఖలు రాశారు. 
నిబంధనలను సవరించడం వల్ల రాష్ట్ర పరిపాలన చిక్కుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పు నిర్ణయాన్ని వెంటనే విమరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.